ధర్మ జాగరణ పాలమూరు విభాగ్ మహిళా బాధ్యుల ఎంపిక
22-11-2026 | 10:40pm
మహమ్మదాబాద్, నవంబర్ 22 : హైదరాబాద్‌లోని కోటి ధర్మ జాగరణ ప్రాంత కార్యాలయంలో(Koti Dharma Jagarana Regional Office) నిర్వహించిన మహిళా సమావేశంలో పాలమూరు విభాగ్ నూతన మహిళా బాధ్యులను ఎంపిక చేశారు. మహమ్మదాబాద్‌కు(Mahammadabad) చెందిన జోషి మణిమాలను జిల్లా మహిళా సంయోజకురాలిగా, గండీడ్ మండలానికి చెందిన కమ్మరి లావణ్యను మహిళా సంయోజకురాలిగా, నరహరి శ్రీలతను సహ సంయోజకురాలిగా, మాధురి నీరజను నగర సహ సంయోజకురాలిగా ఎంపిక చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో ధర్మ జాగరణ ప్రతినిధులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.