మధుసూదన్ రావు దశదిన కర్మల్లో మంత్రి తుమ్మల

21-09-2026 | 12:33pm

సత్తుపల్లి.సెప్టెంబర్ 21.(విజయ క్రాంతి): సత్తుపల్లి మండల పరిధిలోని బేతపల్లి గ్రామంలో బొద్దులూరి మధుసూదన్ రావు దశ దిన కర్మలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao)  పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల తో పాటు సత్తుపల్లి మండల సీనియర్ నాయకులు,బేతుపల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు