నర్సింగ్ విద్యార్థులకు అండగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ
విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే మట్టా రాగమయి
సత్తుపల్లి,(విజయక్రాంతి): విద్యార్థుల(Students) విద్యాభివృద్ధికి తోడ్పాటునందించడమే లక్ష్యంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఖమ్మం జిల్లా(Khammam district) కలెక్టర్ దివాకర ఐఏఎస్, రాష్ట్ర టీజీఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం కల్పించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, విద్యార్థులను ప్రోత్సహించే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో అజయ్ యాదవ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహానా కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, మున్సిపల్ కమిషనర్ నరసింహ, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.