మధుబాబు సేవలు అభినందనీయం ఎమ్మెల్యే రాగమయి

21-10-2026 | 05:59pm

ఆడబిడ్డలకు చీరల పంపిణీ చేసిన మధుబాబు 

గంగారంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సత్తుపల్లి, అక్టోబరు21( విజయక్రాంతి) : దాసరి కుటుంబ సేవలు అభినందనీయమని, సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(Matta Ragamayi Dayanand) అన్నారు. బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) ముగింపు సందర్భంగా గంగారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి(Dasari Venkatarami Reddy)(చిట్టి నాయన) వారి సతీమణి రాజకుమారి, వారి తనయుడు దాసరి మధుమోహన్ రెడ్డి(మధుబాబు) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి శాసన సభ్యురాలు హాజరైనారు.

ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా మధుబాబు సుమారు 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఊహ తెలిసిన దగ్గర నుంచి దాసరి కుటుంబం గంగారం గ్రామస్తులు కోసం చెప్పుకోలేనన్ని సేవలు చేస్తున్నారని,  ఎక్కడ చూసినా వాళ్ళ అభివృద్ధి కనపడుతుందని, గంగారం గ్రామస్తులు చేసుకున్న అదృష్టమని వారి సేవలను కొనియాడారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.

గంగారం గ్రామ అభివృద్ధికి దాసరి కుటుంబం చేస్తున్న కృషిని అభినందించారు. పండుగ వేళ మహిళలకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ,సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వడం స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ దయానంద్‌ విజయకుమార్‌, గ్రామ యువజన కాంగ్రెస్‌ నాయకుడు దాసరి మధు మోహన్ రెడ్డిని గ్రామస్తులు శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి,సర్పంచ్ కాకర్ల రేవతి, రామ గోవిందపురం సర్పంచ్ మౌనికా రెడ్డి,ఉప సర్పంచ్ బెజవాడ రాధ, మధుబాబు యూత్ సభ్యులు

కోలగట్ల చెన్నకేశవరావు,కావేటి అప్పారావు, బెజవాడ శ్రీనివాసరావు ,బండారు మారేశ్వర రావు ,కరాటే రమేష్, యామాల ముత్యాలరావు, కాకర్ల మాణిక్యాలరావు, జల్లిపల్లి వాసుదేవరావు, కోటమర్తి జవహర్లాల్, చిన్ని, వెంకటేశ్వరరావు ,కాలసాని నాగేశ్వరరావు, రాచమల్ల నాగేంద్రరావు ,బండారి జగదీష్, కొవ్వారపు కన్నయ్య, ఎస్కే సుభాని, కోవారపు గిరిబాబు, చల్లారి సత్యనారాయణ, కొండపల్లి మహేష్ ,బెజవాడ మనోజ్ ,మొగిలిచర్ల సత్యనారాయణ, మొగిలిచర్ల మోహనా చారి ,నరదర నాగబాబు నడ్డి ,రాంబాబు, రాచమల్ల నాగేంద్రరావు, వాడే మల్లేశ్వరరావు, సోయం కోటేశ్వరరావు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు