ఉత్సాహాన్ని నింపుతున్న కబడ్డి పోటీలు
రాష్ట్ర మహిళల సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్లో మువ్వ విజయ్ బాబుతో ప్రముఖుల భేటీ
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న 73వ సీనియర్ రాష్ట్ర మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్(73rd Senior State Women's Kabaddi Championship) టోర్నమెంట్ కార్యక్రమం క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరైన మాజీ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు(Former Telangana State Irrigation Chairman Muvva Vijay Babu) అన్నను చల్లా రామకృష్ణారెడ్డి, వెనిగళ్ల నాగేశ్వరరావు, కరాటే వేణు, దుర్గ, డీఎస్ఎన్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మువ్వ విజయ్ బాబుతో ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్రస్థాయిలో మహిళల కబడ్డీ పోటీలు నిర్వహించడం ద్వారా క్రీడాకారిణుల్లో క్రీడాస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, మహిళా క్రీడాకారిణులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొంటున్న మహిళా క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకుంటూ కబడ్డీ క్రీడలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం క్రీడా రంగానికి ప్రోత్సాహాన్నిచ్చే విధంగా కొనసాగాలని వారు పేర్కొన్నారు.