వైభవంగా శ్రీ మాతా నిమిషాంబ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
మేడిపల్లి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్(Boduppal Circle) పరిధిలోని శ్రీ మాత నిమిషాంబ దేవి అమ్మవారు శ్రీ దేవిశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, సామూహిక చండీ హోమం నిర్వహించారు.
ఈ ఏడాది తొలిసారిగా ప్రారంభించిన శ్రీ మాతా నిమిషాంబ మాలధారణ దీక్షను, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాచర్ల చంద్రశేఖర్ శర్మ , భక్తులకు మాలధారణ చేశారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.