సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కూటమి ఎన్నికల ప్రచారం
06-10-2026 | 11:31pm
సత్తుపల్లి (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ కార్మికుల ఎన్నికల సందర్భంగా INTUC (SWU), TWU (TMU-A), SWF (CITU) ఐక్య కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొని కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నకేశవరావు, ఆర్టీసీ INTUC నాయకులు, TWU నాయకులు, CITU నాయకులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.