కూసుమంచిలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయం ప్రారంభం
కూసుమంచి, అక్టోబర్ 15(విజయక్రాంతి): కూసుమంచి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయంను(Star Health Insurance Office) గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని బ్రాంచ్ మేనేజర్ రవి కుమార్, చీఫ్ సెల్స్ మేనేజర్ రామారావు, సెల్స్ మేనేజర్ పెండ్ర అంజయ్య ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ హాఫీజుద్ధీన్, మాజీ ఏఎంసీ చైర్మన్ సెట్రామ్ నాయక్, సర్పంచ్ బొంగా నాయక్, నాయకులు భారీ వీరభద్రం, కొండా శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయ సంఘం మండల బాధ్యులు జర్పుల భద్రునాయక్ , సోషల్ మీడియా అధ్యక్షుడు బెజవాడ శ్రీకాంత్, హాజరై నూతన కార్యాలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే పలువురు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు, స్థానిక ప్రముఖులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ రవి కుమార్ మాట్లాడుతూ ప్రజలందరికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కూసుమంచి మండల ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య బీమా సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా సెల్స్ మేనేజర్ పెండ్ర అంజయ్య అండ్ టీమ్, ఈ కార్యాలయం పనిచేస్తుందని తెలిపారు. కొత్త పాలసీలు, రెన్యూవల్ పాలసీలు ఈ కార్యాలయం నుంచి సద్వీనియోగం చేసుకోవచ్చని చెప్పారు.. ఈ కార్యాలయంలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్లు ఆడేపు శివ,వడ్తియా బాలక్రిష్ణ, చెక్కల నాగస్వర్ణ, సురేష్, పోశం రామారావు, వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.