ఎంబీబీఎస్ సీటు సాధించిన మాజీ ఎంపీపీ కుమార్తె యాతాకుల వేరోనిక
కోదాడ (నడిగూడెం) అక్టోబర్ 15(విజయ క్రాంతి): నడిగూడెం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు(Former MPP Yatakula Jyothi Madhubabu) దంపతుల పెద్ద కుమార్తె యాతాకుల వేరోనిక ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఎంబిబిఎస్ సీట్ సాధించింది.
ఎంబిబిఎస్ సీటు సాధించడం ప్రతి విద్యార్థికి ఒక కల అని తన కూతురు ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల తల్లిదండ్రులు గురువారం ఆనందం వ్యక్తం చేశారు. వేరునితో మాట్లాడుతూ తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నేను ఈ సీటు సాధించానని అన్నారు, మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు గార్ల కూతురు ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల మండలంలో నాయకులు , అధికారులు మండల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.