కల్వరిచర్చి ఉపవాస దీక్ష ప్రార్థనల ముగింపు సభకు పటిష్ట బందోబస్తు
బందోబస్తు ను పరిశీలించిన డీసీసీ భాస్కర్
బెల్లంపల్లి: మంచిర్యాల జోన్ కాసిపేట పోలీస్ స్టేషన్(Kasipet Police Station, Mancherial Zone) పరిధిలోని బెల్లంపల్లి కల్వరి మైదానంలో గత 50 రోజులుగా ఉపవాస దీక్ష ప్రార్థనలు సాగుతున్నాయి. ప్రార్థనల ముగింపు సభ సందర్భంగా చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ముగింపు సభకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున,వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. సభా ప్రాంగణం వద్ద ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ముగింపు సభ ను ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీసీపీ భాస్కర్ సూచించారు.