బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా అధికార ప్రతినిధి

15-10-2026 | 08:51pm

మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 15(విజయక్రాంతి):మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైం అధికార ప్రతినిధిగా(BJYM Spokesperson) సుంకు నవీన్ ముదిరాజ్ నియమాకం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

తనపై నమ్మకంతో బిజెవైం మేడ్చల్ జిల్లా రూరల్ అధికార ప్రతినిధిగా నియమించిన పార్టీ నాయకులకు నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించేవిధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు.అనంతరం మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్,మాజి అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి,బిజెవైం జిల్లా అధ్యక్షులు రాగం అర్జున్ లకు సుంకు నవీన్ ముదిరాజ్ ధన్యవాదాలు తెలియజేశారు.


మరిన్ని వార్తలు