ఐదవ రోజు కొనసాగుతున్న క్రికెట్

15-10-2026 | 08:54pm

వెంకటాపురం నూగూరు అక్టోబర్ 15 విజయక్రాంతి: దసరా మహోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో  కాఫెడ్ మైదానంలో  నిర్వహిస్తున్న  వెంకటాపురం క్రికెట్ అసోసియేషన్(Venkatapuram Cricket Association)  VCA వెంకటాపురం ప్రీమియర్ లీగ్ సీజన్ 03 లో భాగంగా ఐదవ రోజు కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ సేటు నో డ్రగ్ అనే నినాదంతో దూసుకు వెళ్తున్న  విపిఎల్ సీజన్ 3. హేమాచల వారియర్స్  వర్సెస్ వైకింగ్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి  హేమాచల వారియర్స్    ఫీల్డింగ్ ఎంచుకోగా.

మొదట బ్యాటింగ్ చేసిన వైకింగ్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 93పరుగులు చేసింది.సెకండ్ బ్యాటింగ్ దిగిన హిమాచల వారియర్స్ 9.2 ఓవర్లలోనే 94 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని చేదించింది.ఈ మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ ను కనబరిచిన వట్టం నరేందర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది.

ఎస్ ఎస్ వారియర్స్ వర్సెస్ సాయి మెస్ లెవెల్ జరిగిన మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి ఎస్ ఎస్ వారియర్స్   ఫీల్డింగ్ ఎంచుకున్న ది మొదట బ్యాటింగ్ చేసిన సాయి మెస్ లెవెన్ నిర్ణీత 10 ఓవర్స్ లో  138 అత్యధిక పరుగులు చేసింది. 3 వికెట్లు కోల్పోవడం జరిగింది .సెకండ్ బ్యాటింగ్ దిగిన ఎస్ ఎస్ వారియర్స్ 10 ఓవర్స్ లోనే  5వికెట్లు కోల్పోయి 86 పరుగులు మాత్రమే  చేసింది.

52 పరుగుల తేడాతో సాయి మెస్ 11విజయం సాధించింది ఈ మ్యాచ్లో  అద్భుతమైన బ్యాటింగ్ చేసి 60 పరుగులు తో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన  ఉదయ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఇవ్వడం జరిగింది. హేమాచల వారియర్స్ వర్సెస్ దుర్గమ్మ ఏ లెవెన్ మధ్య జరిగిన మ్యాచ్లో హేమాచల వారియర్స్ టాస్ గెలిచి బౌలింగ్  చేయడం జరిగింది.

మొదట బ్యాటింగ్ దిగిన దుర్గమ్మ ఏ లెవెన్ నిర్ణయిత 10 ఓవర్ లో 9 వికెట్ల నష్టానికి 94పరుగులు చేసింది.సెకండ్ బ్యాటింగ్ దిగిన హేమాచల వారియర్స్ ఉత్కట్టంగా జరిగిన మ్యాచ్లో 10 ఓవర్స్ లో 84పరుగులు చేసి 7వికెట్లు కోల్పోయి 10 పరుగులు తేడాతో దుర్గమ్మ లెవెన్ఏకే  విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన  నటరాజ్ కిమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  ఇవ్వడం జరిగింది.

టోర్నీ హైలెట్స్.హేమాచల వారియర్స్ ప్లేయర్ ఉత్తమ  ప్రదర్శన  కనబరిచిన నరేందర్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన  డిప్యూటీ తాసిల్దార్ మహేందర్    చేతుల మీదుగా బహుమతి ఇచ్చి సత్కరించడం జరిగింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది.

మరిన్ని వార్తలు