అంగన్వాడి ఆయా దరఖాస్తుల వెరిఫికేషన్

28-10-2026 | 06:07pm

సిడిపిఓ హేమలత 

బెజ్జూర్ అక్టోబర్ 28 (విజయ క్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా  వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల(Anganwadi Teacher Posts) దరఖాస్తుల పరిశీలన జిల్లా కలెక్టర్ హరిత(District Collector Haritha) ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు సిడిపిఓ హేమలత ఒక ప్రకటనలో తెలిపారు. ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా అంగన్వాడి టీచర్ పోస్టులు 153 ఉండగా 2384 దరఖాస్తులు వచ్చాయని, అంగన్వాడి హెల్పర్ 280 పోస్టులకు గాను 1470 మంది ప్రాజెక్టుల వారీగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నవంబర్ 4 నుండి 7 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు.నవంబర్ 4,5 తేదీలలో ఆసిఫాబాద్, బెజ్జూర్, సిర్పూర్, కౌటాల ఉంటుందని, 6,7 తేదీలలో చింతలమానపల్లి, పెంచికల్పేట్, రెబ్బెన, తిర్యాని ఉంటుందని ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెరిఫికేషన్ కు వచ్చేటప్పుడు వెంట ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రంట్, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, 2 సెట్ జిరాక్స్ కాపీలు, గజిటెడ్ అటేష్టెడ్ తో విద్యార్హత, వయస్సు, స్థానికత, కులం,సర్టిఫికెట్  తో సిడిపిఓ కార్యాలయానికి హాజరుకావాలని వారు తెలిపారు. వెరిఫికేషన్ రాని వారి దరఖాస్తులు తదుపరి ప్రక్రియ పరిగణలోకి తీసుకోబడవని తెలిపారు.

మరిన్ని వార్తలు