నిర్ణీత గడువులోగా భూ రీ-సర్వే పూర్తి చేయాలి

17-10-2026 | 08:32pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో భూ రీ-సర్వే పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ఆరు జీఎన్‌ఎస్ఎస్ రోవర్లను మండల సర్వేయర్లకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో రోవర్లను పంపిణీ చేశారు.రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వీటి ద్వారా భూముల క్షేత్రస్థాయి పరిశీలన, గ్రౌండ్ ట్రూతింగ్, ఇతర సర్వే పనులను మరింత వేగంగా, కచ్చితత్వంతో నిర్వహించవచ్చన్నారు. అధికారులు, మండల సర్వేయర్లు సమన్వయంతో పనిచేసి రీ-సర్వే పనుల్లో జాప్యాన్ని నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు