ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని కాగజ్‌నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గుల్లపల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వడ్నాల వెంకటనర్సయ్య, జాయింట్ సెక్రటరీ భోగ వెంకటేశం, కోశాధికారి కొక్కుల మురళి తదితరుల ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం చేసిన సేవలను కొనియాడారు. కాగజ్‌నగర్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాపూజీకి భారతరత్న పురస్కారం ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిందం చంద్రయ్య, రాపల్లి సదానందం, గడదాసు మల్లయ్య, నూతి సుదర్శన్, కొంపల్లి సుదర్శన్, గాదె వెంకటయ్య, మామిడాల రామకృష్ణ, సుంక లింగమూర్తి, దండె భీమయ్య, గడదాసు శంకరయ్య, వంగర మొగిలి, మామిడాల తిరుపతి, మాచర్ల శ్రీనివాస్, నులిగొండ మొండయ్య, కోడం రాజమొగిలి, బంక శ్రీనివాస్, తెలి శ్రీనివాస్, గడ్డం నాగయ్య తదితరులు పాల్గొన్నారు.