విద్యార్థులకు బోధనోప కరణాల విరాళం
కాగజ్ నగర్ ,అక్టోబర్ 30 ( విజయ క్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని మోసం గ్రామపంచాయతీ పరిధిలో గల ఆరెగూడ ప్రాథమిక పాఠశాల(Areguda Primary School) విద్యార్థులకు బోధన ఉపకరణాల సామాగ్రి విరాళంగా అందించబడింది. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన ఆవుల రవి--పద్మల కుమారుడు యశ్వంత్ స్మారకార్థం ( జన్మదినం )పాఠశాలలో 102 మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భీమన్ కార్ పద్మ-- వసంతరావు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం పర్ష చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము లక్ష్మీనారాయణ, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.