ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు

15-09-2026 | 08:32pm

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే(Engineers Day)ను పురస్కరించుకొని భారతరత్న అవార్డు గ్రహీత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మిషన్ భగీరథ జిల్లా కార్యాలయం(Mission Bhagiratha District Office)లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందిస్తున్న తొమ్మిది మంది ఉత్తమ, అనుభవజ్ఞులైన ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ పీచు వెంకటరమణ రెడ్డి ఎంజేఎఫ్ మాట్లాడుతూ ఇంజనీర్లు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విశ్వేశ్వరయ్య సేవలు, ఆయన ఆదర్శాలు నేటి ఇంజనీర్లకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లయన్ నాంపల్లి శంకర్, క్లబ్ సెక్రటరీ లయన్ బోయిరే ప్రకాష్, క్లబ్ డైరెక్టర్ లయన్ ఎస్. వేణుగోపాల్, ముఖ్య అతిథులు ఇంజనీర్ ఎం.ఏ.ఎం. సిద్దిఖీ, ఈఈ (ఎంబీ-ఇంట్రా), ఇంజనీర్ రాకేష్ బాబు, ఈఈ (ఎంబీ-గ్రిడ్) తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు