డబుల్ బెడ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించాలి

15-09-2026 | 08:21pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సిద్ధాపూర్–కౌట్ల (కె) గ్రామాల మధ్య రూ.31.80 కోట్ల   నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ గృహ(Double bed houses) సముదాయాన్ని అర్హులైన పేదలకు వెంటనే కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. మంగళవారం సయ్యద్ హైదర్ పార్టీ జిల్లా నాయకులతో కలిసి గృహ సముదాయాన్ని ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. 

25 బ్లాకుల్లో 600 కుటుంబాలకు ఇళ్లు అందించాల్సి ఉండగా, పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేసి అర్హులకు కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సయ్యద్ హైదర్ ఆరోపించారు. కలెక్టర్ జోక్యం చూసుకొని వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు