గణపతి బప్పా మోరియా.. భక్తి సందడిలో కౌటాల

15-09-2026 | 08:27pm

కౌటాల,(విజయక్రాంతి): సోమవారం మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాల్లో వినాయక విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. గణపతి బప్పా మోరియా నామస్మరణతో గ్రామాలు మార్మోగాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో ఎక్కడ చూసినా సందడి నెలకొంది.

వినాయక మండపాలను నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్‌ దీపాలు, పుష్పాలతో మండపాలను ముస్తాబు చేసి పండుగ కళను తీసుకొచ్చారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి గణనాథుడికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

తొమ్మిది రోజుల పాటు భక్తి సందడి

మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాలకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజలు, హారతులతో మండపాలు సందడిగా మారనున్నాయి. పలుచోట్ల భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు