తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసిన బీడీ కార్మిక మహిళలు

15-09-2026 | 07:50pm

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) రుద్రంగి తహశీల్దార్ కు బీడీ కార్మిక మహిళలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీడీ కార్మిక సంఘం AITUC రాష్ట్ర జనారల్ సెక్రెటరీ సూతరి రాములు మాట్లాడుతూ... ​చేయూత పథకం క్రింద చేనేత, గీతా కార్మికుల మాదిరిగా బీడి కార్మికులను కూడా గుర్తించాలని ​బీడి కార్మికులకు గతంలో మాదిరిగా జీవనభృతి రూ.2016/-లు అన్ని కేటగిరీలకు చెల్లించాలి. ​ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం 2014 కటాఫ్‌ను ఎత్తివేయాలని కోరారు. బీడి పరిశ్రమపై జి.ఎస్.టి. పెంచి అనేక రకాలుగా ఆంక్షలు విధించడం వలన బీడి పరిశ్రమలో పని దినాలు తగ్గి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అనేక పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం బీడి కార్మికుల జీవనభృతి(Living wage of beedi workers) క్రింద రూ.2016/-లు అమలు చేసింది.​2014 లో కటాఫ్ తేది విధించటం మూలంగా ఇంకా 50% మంది బీడి కార్మికులకు జీవనభృతి అందకుండా పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భముగా చేయూత పథకం క్రింద బీడి కార్మికులకు ప్రతి నెల రూ.2016/-ల నుండి రూ.4000/-ల వరకు ఇస్తామని ఎన్నికలలో హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాటించిన విషయాన్ని గుర్తు చేసారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా నేటికి అమలు చేయలేదని అన్నారు.​

ప్రస్తుతం ఆసరా ఫెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న సందర్భములో బీడి కార్మికుల జీవనభృతి ఆన్‌లైన్‌లో రావడం లేదు, దీని వలన బీడి కార్మికుల దరఖాస్తులు తీసుకోవడం లేదని ​కావున ఎన్నికల హామీ ప్రకారం చేయూత పథకం క్రింద మాకు ఎలాంటి నిబంధనలు,ఆంక్షలు లేకుండా ప్రతి నెల జీవనభృతిని అమలు  చేయాలని విజ్ఞప్తి చేస్తూ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశామని ఈవినతిపత్రన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బిడీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరారు.ఈకార్యక్రమంలో రుద్రంగి బీడీ కార్మికులు మహిళలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు