భీమ్ వర్ధంతి ఏర్పాట్ల పరిశీలన
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కెరమెర మండలంలోని చారిత్రక జోడేఘాట్లో శనివారం నిర్వహించనున్న ఆదివాసీ వీరుడు కుమరం భీమ్ వర్ధంతి(Kumaram Bheem Death Anniversary) కార్యక్రమ ఏర్పాట్లను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ శుక్రవారం పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో తాగునీరు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్, సీఐ వేణుగోపాల్, ఎస్ఐ రాజు, ఏటీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.