మాజీ ఎమ్మెల్యేకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల వినతి

28-10-2026 | 04:32pm

కాగజ్ నగర్, అక్టోబర్ 28 ( విజయ క్రాంతి): ప్రభుత్వ వైద్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్పకు(Former MLA Konappa) వినతి పత్రం అందజేశారు. బుధవారం కొమరం భీం ఆసిఫాబాద్  జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కోనప్ప నివాసంలో తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించాలని వారు కోనప్పకు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఎస్ హెచ్ ఎస్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. ఈఎస్ఐ, పిఆర్సి, పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని  ఉద్యోగులు తమ డిమాండ్లలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు