దుర్గం రవి గౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

25-11-2026 | 05:12pm

గణపురం, నవంబర్ 25 (విజయక్రాంతి): గణపురం మండల కేంద్రానికి చెందిన దుర్గం రవి గౌడ్‌ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ(MLA Gandra Satyanarayana Rao) రావు బుధవారం హనుమకొండలోని ఆస్పత్రిలో పరామర్శించారు. ఆస్పత్రిలో ఆపరేషన్ పూర్తి కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు