తొలిసారి చూశాక నిన్నే..
నిహారిక కొణిదెల(Niharika Konidela) పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. ఇందులో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్), నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా, శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి కీలక పాత్రను పోషించగా.. శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
డిసెంబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘అప్సర’ అనే పాటను విడుదల చేశారు. ‘తొలిసారి చూశాక నిన్నే.. మునిగాను నీ మాయలోనే, నడిచాక నీ దారిలోనే.. కలిసేశాను సరికొత్త నన్నే, ఎదలోన చిగురాశ నీవే.. ఎరవేసి చిదిమేసినావె, ఒకసారి వరమిచ్చిపోవె.. ఓ వయ్యారివే, ఆకాశం నీవేనా పాతాళంలోన చివరలోన నుంచుని తలచిన నిన్నే చేరనా.. అప్సర అప్సర..’ అంటూ సాగుతోందీ గీతం.
రమేశ్‌కుమార్ రాసిన ఈ పాటను గ్యానీ బాణీ సమకూర్చి, పాడారు. ఈ సినిమా ఆడియో పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి కెమెరామెన్: ఎదురోలు రాజు; సంగీతం: గ్యానీ; ఎడిటర్: అన్వర్ అలీ; ప్రొడక్షన్ డిజైన్: విష్ణువర్ధన్ పుల్లా.