పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ ఆది రుద్రాక్ష

25-11-2026 | 05:20am

పంచమహాశక్తులు, మహారహస్యం, దుష్టశక్తుల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్(Mythological action thriller) ‘ఆది రుద్రాక్ష’. ఆర్యన్ హీరోగా నటిస్తూ రచనాదర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి షేక్ మహబూబ్ బాషా నిర్మాత. ఈ సినిమా తొలి గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఆర్యన్ మాట్లాడుతూ.. “త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా సినిమాను రూపొందిస్తాం” అన్నారు.

నిర్మాత బాషా మాట్లాడుతూ.. “చిత్రాన్ని మంచి నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అందరం సమష్టిగా కృషి చేస్తున్నాం” అని తెలిపారు. ‘ఆర్యన్ చెప్పిన కథ నాకు ఎంతో నచ్చింది. ఇందులో భాగమయ్యే అవకాశం కల్పించినందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’ అని హీరోయిన్ రూప చెప్పింది. చిత్ర యూనిట్ సభ్యులు నవీన్, సందీప్, శ్రీనివాస్ కూడా ఈ ఈవెంట్‌లో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు