తెలుగు రాష్ట్రాల్లో వెదర్‌ టెన్షన్‌

09-11-2026 | 09:33am

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం(Weather in Telugu states) మరోసారి మారనుంది! బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) అంచనా వేసింది. నవంబర్‌ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో Low Pressure ఏర్పడవచ్చని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. దీంతో చలి పెరుగుతున్న సమయంలో వర్ష సూచనలు కూడా తెరపైకి వచ్చాయి.

తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

మరోవైపు తెలంగాణలో Cold Wave పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ వంటి శివారు ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన Fog కనిపిస్తోంది. సాయంత్రం 5:30 గంటల తర్వాత చల్లని గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి మరింత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.

ఏపీకి ఉరుములు, మెరుపులతో వర్ష సూచన

కొత్తగా ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చని అంచనా వేసింది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో Gusty Winds వీచే అవకాశం ఉంది. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సోమవారం తర్వాత వాతావరణం క్రమంగా Dryగా మారవచ్చని అధికారులు పేర్కొన్నారు. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని కదలిక, తీవ్రతను బట్టి వర్షాల ప్రభావంపై మరింత స్పష్టత వస్తుంది. ప్రజలు IMD Weather Updatesను గమనించాలని, ఉదయం పొగమంచు, రాత్రి చలి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా అప్రమత్తంగా ఉండటం మంచిది.

మరిన్ని వార్తలు