కేసముద్రం వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలి
16-09-2026 | 08:29pm
మున్సిపాలిటీ ఎదుట కౌన్సిలర్ల నిరసన
కేసముద్రం,(విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ(Kesamudram Municipality) పరిధిలోని వివిధ వార్డుల్లో తాగునీరు, డ్రైనేజీ, దోమల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన(Councilors protest) వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. తాగునీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.