పూల జాతర.. పాటల హోరు
14-10-2026 | 11:41am
మహబూబ్నగర్ జిల్లా, మహమ్మదాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ గాయత్రీ దేవి, మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలంతా కలిసి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు.