అమ్మవారి చెంతకు మాజీ కార్పొరేటర్!

14-10-2026 | 12:53pm

రామచంద్రాపురం, ఆగస్టు 14 (విజయక్రాంతి): నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో ఉన్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో (Bathukamma Celebrations) ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్‌తో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు