సిద్దార్థ ఇన్‌స్టిట్యూట్‌లో హ్యాక్ ఎక్స్‌లరేట్

14-10-2026 | 05:05am

ఘనంగా 24 గంటల ఆన్-క్యాంపస్ హ్యాకథాన్

హైదరాబాద్, అక్టోబర్ 13(విజయక్రాంతి): సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో(Siddhartha Institute of Engineering and Technology) ఇనిస్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్(ఐఐసీ), కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (Computer Society of India)(సీఎస్‌ఐ) హ్యాక్ ఎక్స్‌లరేట్ 2026పేరుతో 24 గంటల ఆన్-క్యాంపస్ హ్యాకథాన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు. కోడ్.ఇన్నోవేట్ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్‌కు బైట్‌ఎక్స్‌ఎల్  నిర్వాహక సంస్థగా, కేఏఎంపీయూఎస్.వీసీ పవర్డ్ బై పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి. కేపీఎంజీ ఇన్ ఇండియా కార్పొరేట్ పార్టనర్‌గా, ఆల్ట్రిక్స్ ల్యాబ్స్   అసోసియేట్ పార్ట్‌నర్‌గా భాగస్వా మ్యం వహిస్తున్నాయి.

ఈ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమై 24 గంటల పాటు నిర్వహించబడుతోంది. విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మక ఆలోచనలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను ఉపయోగించి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారు.ఈ సందర్భంగా బైట్‌ఎక్స్‌ఎల్ సీనియర్ మేనేజర్ (ఆపరేషన్స్) డా. శ్రావణ్ కుమార్   ప్రసంగిస్తూ, హ్యాకథాన్ల ద్వారా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను ప్రాక్టికల్‌గా ఉపయోగించుకోవడంతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

కొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి, టీమ్వర్క్ మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. శేఖర్ బాబు మాట్లాడుతూ, విద్యార్థుల్లో సాంకేతికత పెంపొందించేందుకు హ్యాకథాన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు