తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్టోబర్ 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Thunderstorms) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, జనగామ, వరంగల్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే, అక్టోబర్ 18న కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశముందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.