గోదావరిఖనికి గులాబీ దండు

14-10-2026 | 12:27pm

సత్తుపల్లి, అక్టోబర్‌ 14 (విజయక్రాంతి): గోదావరిఖనిలో నేడు నిర్వహించనున్న సింగరేణి సింహ గర్జన (Singereni Simha Garjana) సభకు సత్తుపల్లి నుంచి సింగరేణి కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. టీబీజీకేఎస్‌ నాయకత్వంలో బస్సుల్లో ప్రయాణమైన కార్మికులు, యూనియన్‌ నాయకులు సభకు తరలివెళ్లారు.

సింగరేణి కార్మికులు, యూనియన్‌ నాయకులు జై కేసీఆర్‌, జై కేటీఆర్‌ అంటూ నినాదాలు చేస్తూ గోదావరిఖనికి బయలుదేరారు. కేటీఆర్‌ నాయకత్వానికి మద్దతుగా నినాదాలు చేస్తూ సభలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ప్రయాణం సాగించారు.సత్తుపల్లి ప్రాంతానికి చెందిన సింగరేణి ఉద్యోగులు, కార్మికులు, యూనియన్‌ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంతో స్థానికంగా సందడి నెలకొంది. సింగరేణి కార్మికుల సమస్యలు, వారి హక్కులు, సంక్షేమ అంశాలపై నిర్వహిస్తున్న ఈ సభకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గోదావరిఖనిలో జరగనున్న సింగరేణి సింహ గర్జన సభపై కార్మిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు