ఇంద్రకీలాద్రిపై మహా చండీదేవి అలంకరణ
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు (Sharannavaratri Celebrations) నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నేడు దుర్గమ్మ మహా చండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి కల్పించారు.
అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు (Queue Lines), భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహా చండీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు.