చండీ రూపంలో జగజ్జనని

14-10-2026 | 12:21pm

సంస్థాన్‌ నారాయణపూర్‌, అక్టోబర్‌ 14 (విజయక్రాంతి): నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నప్రసాద సేవ ఆశ్రమ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలు (Sharannavaratri Celebrations) భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు శ్రీ మహా చండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకరానంద స్వామీజీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపధూప నైవేద్యాలు (Special Offerings) సమర్పించి భక్తితో ఆరాధించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. నాలుగో రోజు మహా చండీ దేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దుర్గామాత మాలాధారులు, స్థానిక భక్తులు ఉత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణంలో భక్తిమయ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు