కరెంటు కోతలపై బిఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీటింగ్

16-10-2026 | 02:42pm

కోయిలకొండ అక్టోబర్ 16 న్యూస్ విజయక్రాంతి: కోయిలకొండ మండల కేంద్రంలో  బి ఆర్ ఎస్ పార్టీ ఆఫీస్(BRS Party Office) దగ్గర   ఈరోజు నారాయణపేట జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభలు ఎస్ రాజేందర్ రెడ్డి(Former Legislator S. Rajender Reddy) గారి ఆదేశం మేరకు కోయిలకొండ మండల కేంద్రంలో రైతులకు వ్యవసాయానికి కరెంటు మూడు పువ్వులు ఆరు కాయాలని చెప్పిన కాంగ్రెస్ మోస ప్రభుత్వం 24 గంటల కరెంటు.

ఇస్తామని చెప్పి కనీసం రోజుకు 4.నాలుగు గంటలు కూడా ఇవ్వడం లేదని  లో వోల్టేజ్ కరెంట్ వల్ల మోటార్లు  కాలిపోతున్నాయని కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో అయోమయంగా ఉందని రైతుల పంటలు ఎండిపోతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నదని రైతులు అప్పులు చేసే పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారని ఇకనైనా స్పందించి నాణ్యమైన 24 గంటల త్రీ బిస్ కరెంటు ఇవ్వాలని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి. కృష్ణయ్య విమర్శించారు.

ఇట్టి కార్యక్రమానికి పార్టీ కార్యదర్శి రాజ వర్ధన్ రెడ్డి  మాజీ జెడ్పిటిసి విజయభాస్కర్ రెడ్డి. మాజీ ఎంపీపీ. శశికళ బీమ్ రెడ్డి. స్వప్న రవి. మాజీ పీఎస్ఎస్ చైర్మన్ ఏ శ్రీనివాస్ రెడ్డి. బి ఆర్ ఎస్ నాయకులు నవీన్. మరియు సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు