అధికార పార్టీలో అసంతృప్తులు ఎక్కువంట?
- పార్టీని నమ్ముకున్న... ఆశించిన గుర్తింపు లేదంట!
- ఆ మండలంలో అధికార పార్టీ నేతల అంతర్యుద్ధం!
- చక్కదిద్దేవారు దరిదాపుల్లో లేరంటూ అసహనం
- వారు చెప్పిందే ఎమ్మెల్యేకు వేదం మంట?
మహమ్మదాబాద్ అక్టోబర్ 16: ఆ మండలంలో అధికార పార్టీలో అసంతృప్తులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నారంట. ఇందుకు ప్రధాన కారణాలు కూడా లేకపోలేదని సొంత పార్టీ నేతలే చెబుతుండ్రు అంటే ఈ నిరాశ ఏ మేరకు ఉందో? గత పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధికారంలో ఉన్నప్పటికీ దీన్ని ఇబ్బందుల గురిచేసిన వారు నమ్ముకున్న లక్ష్యం వైపు నిలబడి.. కాంగ్రెస్ పార్టీ(Congress party)ని ఎప్పటికైనా తమ పార్టీ అధికారంలో కి వస్తుంది అని ఆశించిన నిజమైన కార్యకర్తలను వెనక్కి నెట్టే పరిస్థితిలే మెండు గా కని పిస్తున్నాయంట.
ఇలా ఉంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటువైపు చూస్తా రో అని భయం ఉందంటూ సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రని తెలుస్తుంది. మరోపారి అధికారంలోకి వస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి అంతర్లీనంగా జరుగుతున్న సొంత పార్టీలోనే అంతర్యుద్ధాల ముగింపు పలికేది ఎవరంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలే అసహనం వ్యక్తం చేయడంతో ఇలా ఉంటే ఎలా అనే చర్చ ఆ మండలంలో ఉపందుకుంటుందంట.
కావాలని దూరం పెడుతున్నారంట!
మండల పరిధిలోని పలు గ్రామాలలో కావాలనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు దూరం పెడుతున్నారంట. వీరు దూరమైతేనే తాము అనుకున్నది ఆయా గ్రామాల పరిధిలో చేసిందేకు అవకాశం ఉంటుందని కొందరు ఎమ్మెల్యే మదిలో గుర్తింపు పొందిన నేతలు తమ ప్రణాళికలను అమలు చేస్తున్నారంటూ సొంత పార్టీ నేతలే చెబుతున్న మాట. ఎమ్మెల్యే కు సైతం పలు అంశాలను వివరించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ వారు కూడా ఆ కొందరి మాటే వేదంగా భావిస్తారని తాము మాటకు పార్టీలో విలువ లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారంట.
ఇది ఇలాగే కొనసాగితే ఆ మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ కి తీవ్ర ఇబ్బందులే వస్తాయని ప్రత్యేకంగా చర్చ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. పార్టీలో అంతర్గత విషయాలను కూడా ఎమ్మెల్యే ప్రతి ఒక్క చెరువు తీసుకొని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని సొంత పార్టీ నేతలు పేర్కొనడంతో ఈ చర్చకు ప్రత్యేకత చోటు చేసుకుంటుందంట.
మరోసారి మాదే అధికారం అంటున్న సీఎం..
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఆటంకాలు సృష్టించిన అధికారంలోకి వచ్చేది మరోసారి కాంగ్రెస్ పార్టీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండ్రు. కాగా ఈ మండల పరిధిలో నెలకొన్న అసంతృప్తి నేతలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నారని చక్కదిద్దకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు చర్చించుకుంటున్నారంట. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని అంతర్గత విషయాలు చక్కదిద్దితేనే భవిష్యత్తులో పార్టీకి మేలు జరిగే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఈ మండలంలో అధికార పార్టీ ఉన్నప్పటికీ కార్యకర్తలు తమ ఆవేదనను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అంట.
కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ కార్యాలయం అంటూ హడావిడి చేసి ఆ తర్వాత అన్ని ఎత్తేస్తారని తెలుస్తుంది. ప్రజల సైతం మండల పరిధిలోని తమ సాధకబాధకులను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయం ఉంటే బాగుంటుందని పలువురు చెబుతుండ్రు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఏ మేరకు చర్యలు తీసుకుంటారో..ఆ కొందరు చెప్పే మాటలు వింటారో? నేతలను ఒక తాటిపైకి తీసుకు వస్తారో వేచి చూస్తామంటూ ఆ పార్టీ నేతలు చెప్పడం ఈ చర్చకు దారితీస్తుంది. ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రత్యేక తీసుకుంటేనే అంతర్యుద్ధం ముగింపు పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయి.