పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

16-10-2026 | 02:45pm

రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి అక్టోబర్ 16: విద్యుత్ కోతల కారణంగా చేతికొచ్చే దశలో వరి పంటలు ఎండిపోతున్నాయని, నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్(State Food Corporation) చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతున్న వరి పంటలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను, పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు, ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఎంతో కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికొచ్చే దశలో ఎండిపోతుండటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల వల్ల పంటలకు అవసరమైన నీటిని అందించలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, కేలై కాలుల ద్వారా సాగునీరు అందించాలని పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను గుర్తించి తగిన పరిహారం అందించాలని  డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు