అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ
రాజాపూర్ అక్టోబర్ 28 : మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి భక్తులు(Devotees of Lord Ayyappa) అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి పై భక్తితో అయ్యప్ప మాల ధరించే భక్తులు అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.
అయ్యప్ప స్వామి మాల ధరించే భక్తులు స్వామి వారి పూజల కోసం ఆలయంలోనే పూజలు నిర్వహించేందుకు ఈ ఆలయ నిర్మాణం తమ సొంత ఖర్చులతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శేఖర్ గౌడ్,శ్రీనివాస్ రెడ్డి, మహేష్,నాగేష్ రెడ్డి, నారాయణ గౌడ్, శేఖర్ రెడ్డి,శ్రీకాంత్, రఘు, వెంకటేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.