ఇందిరమ్మ ఇళ్లు పేదలకు గౌరవం

16-10-2026 | 07:34pm

రాజాపూర్ అక్టోబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పేదల గౌరవాన్ని నిలుపుతున్నాయని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సింగ్ తాండా గ్రామపంచాయతీ(Nursing Thanda Gram Panchayat) పరిధిలోని దేవుల తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిచారు.ఇందిరమ్మ ఇంటి  లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ నాయక్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్ మాజీ ఎంపిటిసి సునీత శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ యాదగిరి, విక్రమ్ రెడ్డి రమేష్ రమణ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు