పసిపిల్లవాని చితకబాదిన ఉపాధ్యాయుడు
కోయిలకొండ (విజయక్రాంతి): కోయిలకొండ మండలంలోని మల్లాపూర్ ప్రాథమిక పాఠశాల(Mallapur Primary School)లో రెండవ తరగతి చదువుతున్న జోగు రాకేష్ s/o ఆంజనేయులు చంటి బాలుడు పై క్లాస్ ఉపాధ్యాయుడు చాలా చిత్రహింసలు గురిచేసి కట్టెలతో చితక బాధడం జరిగింది. అన్ని విద్యార్థి సాయంత్రం ఇంటికి వచ్చిన తమ తల్లిదండ్రులకు చెప్తూ బోరున ఏడ్చాడు ఏమైందని చూడగా బాలుడు వణుకుతూ తనను టీచరు తీవ్రంగా కొట్టినాడని ఏడ్చుకుంటూ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులను మంచిగా చూసుకుంటదని పంపిస్తే మంచి విద్యను అందిస్తాది అనుకుంటే మా పిల్లలకు చావుకు వచ్చిందని పేరెంట్స్ వాపోయారు ఇట్టి పిల్లలపై దాడి చేసిన టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.