బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

20-11-2026 | 04:43pm

దండేపల్లి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా(Mancherial District) దండేపల్లి మండలం(Dandepalli mandal) గూడెం సెక్టార్ పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(Department of Women Development and Child Welfare) (ICDS) ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై(Eradication of Child Marriages) ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే(Tehsildar Rohit Deshpande) మాట్లాడుతూ బాల్య వివాహాలు(Child Marriages) చేయడం చట్టరీత్యా నేరమని, చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల ఆడపిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాలికల విద్యను ప్రోత్సహించాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి కల, ఉప సర్పంచ్ తోట శ్రీధర్, వార్డు సభ్యులు, మాజీ DCC చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్థిక అక్షరాస్యత నిపుణురాలు లిప్సిక, పంచాయతీ సెక్రటరీ  లావణ్య, అంగన్‌వాడీ టీచర్ (AWT) N. పద్మ, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు