దండేపల్లి పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

25-11-2026 | 04:47pm

దండేపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి పీహెచ్ సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్(Dr. Narender Rathod) బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ మౌనిక, వైద్య సిబ్బందితో వైద్య ఆరోగ్య కార్యక్రమాలపైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది అందరూ మీ ప్రమాణం అటెండెన్స్ హాజరు నమోదు చేసుకోవాలని, వైద్యులు వైద్య సిబ్బంది, ఉప కేంద్రాల సిబ్బంది సమయపాలన పాటిస్తూ వైద్య ఆరోగ్య సేవలు అందించాలన్నారు.

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బంది ఈ క్రింది సూచనలను, ఆదేశాలను పాటించాలన్నారు. ముఖ్యంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మీ ప్రమాణం హాజరు, సమయపాలన, ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరంలో ఏర్పాటు చేయడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు సంరక్షణ, 100% గర్భవతుల నమోదు, వైద్యాధికారి ద్వారా గర్భవతులకు పరీక్షలు, ఆసుపత్రిలో ప్రతి వారం టీకాల కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం, శనివారం తప్పకుండా వాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించి యువిన్ యాప్ లో నమోదు చేయాలన, కుష్టి వ్యాధిగ్రస్తులను చిన్న పిల్లల్లో ఉన్నవాటిని గుర్తించి ప్రత్యేక వైద్య నిపుణులకు చూయించాలనీ, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ద్వారా 39 రకాల వైద్య ఆరోగ్య సేవల పైన సమీక్షలు నిర్వహించడం, వారానికి ఒకసారి జరుగుతుందన్నారు.

అందువలన వైద్యాధికారులు తమ తమ టార్గెట్లను పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా మాస్ మీడియా బృందం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చేయాలని, లేని పరిస్థితుల్లో సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు