ప్రభుత్వ వైద్య కళాశాలలో ఘనంగా కడావర్ ప్రమాణం
గణపురం, నవంబర్ 25 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల(Government Medical College)లో మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు కడావర్ ప్రమాణ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. మానవ శరీర నిర్మాణాన్ని కడావర్ ద్వారా అభ్యసిస్తూ, మరణానంతరం కూడా విజ్ఞానానికి ఉపయోగపడుతున్న శరీరాలను గౌరవిస్తూ విద్యనభ్యసిస్తామని విద్యార్థులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శరీరదానం, విజ్ఞానంపై నాటిక ఆకట్టుకుంది. అనంతరం అనాటమీ విభాగం వైద్యులు విద్యార్థులతో కడావర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ రావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ రాజేష్, డాక్టర్ పావని, డాక్టర్ అజయ్ ప్రకాష్, డాక్టర్ లోయీస్ ఫీబి తదితరులు పాల్గొన్నారు.