భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి

25-10-2026 | 05:30am
  1. పుష్కరాలకు రూ.౨వేల కోట్లకు పైగా నిధులు మంజూరు
  2. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

మంచిర్యాల/భూపాలపల్లి/ కాళేశ్వరం, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : గోదావరి పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు(Commissioner of the Endowments Department, Hanumantha Rao) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీవో శ్రీనివాస్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, తహసీల్దార్ రఫతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్, జిల్లా దేవాదాయ అధికారి రవిలతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పుష్కరాలలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 2 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందన్నారు. 

అలాగే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని తెలిపారు. బాసర ఆలయానికి రూ. 354 కోట్లు కేటాయించగా, అందులో రూ. 324 కోట్లు ప్రభు త్వ నిధులు కాగా, మిగిలిన సుమారు రూ. 30 కోట్లు విరాళాల రూపంలో సమకూరనున్నాయని తెలిపారు. కాళేశ్వరం ఆలయానికి రూ. 198 కోట్లు, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ఆలయానికి రూ. 276 కోట్లు,

ధర్మపురి ఉగ్ర నరసింహస్వామి ఆలయ నిర్మాణ, పునర్నిర్మాణ పనులకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. మం చిర్యాల జిల్లాలోని గూడెం గుట్ట ఆలయ అభివృద్ధికి రూ. 58 కోట్లు మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు.

పోలీసు శాఖకు అవసరమైన బడ్జెట్ కేటాయించామని, ట్రాఫిక్ నియ ంత్రణ, జనసమూహాల నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థలను వినియోగించేందుకు ప్రణాళికలు రూపొంది స్తామని తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధమవుతోందని తెలిపారు. పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి తీరం వద్ద పుష్కర ఘాట్ ఏర్పాట్లను పరిశీలించారు. 

కాళేశ్వర పుష్కర ఘాట్ల పనుల పరిశీలన

కాళేశ్వరంలో పుష్కరఘాట్ల అభివృద్ధి, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కాళేశ్వరం క్షేత్రంలో పర్యటించిన ఆయన వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వచ్చే నెల 4న మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం పర్యటనకు రానున్న నేపథ్యంలో అప్పటిలోగా పనుల్లో గణనీయమైన పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు