జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని నిరసన

15-10-2026 | 07:52pm

నస్పూర్, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం జనగణనలో ఓబీసీ కాలం పెట్టి కులానికి ఒక యూనిట్ కోడ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి(National BC Rights Struggle Committee) ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా  సీసీసి కార్నర్ లో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం 1931లో బీసీ కుల గణన చేపడితే దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న బీసీ కుల గణన  చేపట్టకపోవడం అంటే ఇది బీసీలపై వివక్షగా భావిస్తున్నామున్నారు. బీసీ కులగనను చేపట్టాలని దేశంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో మా ఉద్యమానికి తలోగ్గిన 10 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ప్రధాని మోడీ పార్లమెంటులో మేము కులగనున చేపడతామని చెప్పి మాట తప్పడం బాధాకరమన్నారు.

జనగణనలో ఓబీసీ కాలం పెట్టకపోవడం అంటే బీసీలను మోసం చేయడమే అవుతుందనీ, బీసీ కుల గణన చేపడితే చట్టసభలలో బీసీలకు  రిజర్వేషన్ కల్పించాలని, ప్రస్తుతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కేంద్రపాలకులు భావిస్తున్నారన్నారు. బీసీలకు ఇవ్వాల్సిన ప్రజాస్వామ్య వాటా ఇవ్వకుండా ఎన్ని ఏండ్లు  దాటవేస్తారని ప్రశ్నిస్తున్నామని, అలాగే ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమి ఓబీసీ కాలంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం జనగణనలో ఓబీసీ కాలం చేర్చి కులానికి ఒక యూనిక్ కోడు పెట్టాలని, లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందు ఎండగట్టి బీసీ సమాజం ముందు బిజెపిని దోషిగా నిలబెడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కంచర్ల సదానందం, అశోక వేముల, పెద్దల చంద్రకాంత్, దేవస్థాన నాగరాజ్, ఎండి లతీఫ్, తంగళ్ళపల్లి బాపు వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు