ప్రాణాలు హరిస్తున్న ఆర్‌ఎంపీల చికిత్స..!

07-10-2026 | 05:20am
  1. మండలంలో అర్హతలేని వైద్యుల హల్ చల్ 
  2. పలువురి మరణాల వెనుక ఆర్‌ఎంపీల పాత్ర..?
  3. చోద్యం చూస్తున్న జిల్లా యంత్రాంగం 

లక్షేట్టిపేట, అక్టోబర్ 6 : లక్షెట్టిపేట మండలంలో అర్హత, అనుభవం లేని ఆర్‌ఏంపీ వై ద్యుల చికిత్సతో(Treatment by RMP doctors) రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. చదివింది ఒక కోర్సు అయి తే చేసేది స్థాయికి మించిన వైద్యం కావడం తో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. ఆర్‌ఏంపీలు అచ్చి రాని వైద్యంతో రోగుల ప్రాణాలతో(Patients' lives) చెలగాటమాడుతున్నా రు. కొందరు ఆర్‌ఏంపీల తీరు దొరికితే దొం గ లేకపోతే దొర అనే చందంగా మారింది.

నర్సింగ్ హోంలు(Nursing homes), క్లినిక్ లలో వైద్యుల అర్హతలు, రిజిస్ట్రేషన్(Doctors' Qualifications and Registration), సిబ్బంది వివరాలు, ఆసు పత్రి సదుపాయాలు, చేస్తున్న చికిత్సల గు రించి నిరంతరం వైద్య శాఖ తనిఖీ చేయాల్సి ఉన్నా, ఫిర్యాదులు రాలేదని అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఆర్‌ఏంపీలు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, హైడోస్ మందులు రోగులకు ఇవ్వడంతోనే మరణా లు సంభవిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. 

మచ్చుకు కొన్ని...

ఇటీవల మండలంలోని దౌడేపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత, దండేపల్లి మం డలంలోని ఓ వివాహిత, ఓ మాజీ సర్పంచ్ ఈ అర్హత లేని ఆర్‌ఏంపీల వైద్యం వికటించడంతోనే తనువు చాలించారనే ప్రచారం జో రుగా జరుగుతోంది. ఓ ఆర్‌ఏంపీ ఏకంగా స్థానిక ప్రజాప్రతినిధి తొడకు సైలెన్ పెట్టి, హై డోస్ మందులతో చికిత్స చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో రోగి పరిస్థితి విష మించడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ రోగి మరణించాడు.

అర్హత, అనుభవం లేకపోవడంతో అప్పటికే అందించిన వైద్యం వికటించడంతో, ఆ తర్వాత పెద్ద ఆసుపత్రులకు తరలించిన కూడా చివరికి రోగుల ప్రా ణాలు దక్కడం లేదని బాధిత కుటుంబ స భ్యులు రోదిస్తున్నారు. అప్పట్లో పట్టణంలో ఓ ఫిజియోథెరఫీ వైద్యుడు అర్హతలు లేకు న్నా కూడా క్లినిక్ నడుపుతున్నారని తెలుసుకున్నటువంటి వైద్య శాఖ అధికారులు ఆ క్లిని క్ ను తాత్కాలికంగా సీజ్ చేశారు. మండలం లో తరచుగా జరుగుతున్న కొన్ని మరణాలు బయట ప్రపంచానికి తెలిసే లోపే సదరు ఆర్‌ఏంపీ లు మధ్యవర్తుల ద్వారా రాజీ కు దుర్చుకుని పోలీస్ కేసులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. 

బాధితులు, ఆర్‌ఏంపీ లు రాజీ కుదుర్చుకోవడంతో పోలీసులు సైతం ఏమి చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు బా ధిత కుటుంబాలు రాజీకి ససేమీరా అంటూ న్యాయం కోసం జాతీయ రహదారిపై రాస్తారోకో లు చేసిన పలు సంఘటనలున్నాయి.

సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేదు

పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆర్‌ఏంపీ, పీఏంపీలు చేసిందే వైద్యం, చెప్పిందే ఫీజు అన్నట్లుగా మారింది. అర్హతలు లేకున్నా కూడా వైద్యం చేసి రోగుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. కొందరు ఏకంగా ఇంజెక్షన్స్ ఇస్తూ, గ్లూకోస్ లు పెట్టి ఎంబీబీఎస్ ల కంటే ఎక్కువగా చలామణి అవుతూ క్లినిక్ లు నడుపుతున్నారు. దీనితో సామాన్య ప్రజల ప్రాణాలకు లెక్క లేకుండా పోతోంది. నూతనంగా వచ్చిన డీఏంహెచ్‌ఓ అర్హతలు లేని వైద్యులపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

అవునూరి వెంకటేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి, లక్షెట్టిపేట

ప్రథమ చికిత్సకు మించి చేయకూడదు -

ఆర్‌ఏంపీ, పీఏంపీలు కేవలం ప్రథమ చికిత్స స్థాయి వరకు మాత్రమే వైద్యం చేయాలి. స్థాయికి మించి వైద్యం చేయడమంటే రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుంది. ఇక నుంచి ప్రతి మండలంలోని ఆర్‌ఏంపీ, పీఏంపీల అర్హతల సర్టిఫికెట్స్ పరిశీలించడంతో పాటు గ్రామాల్లో వారందిస్తున్న చికిత్సలపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీలు చేస్తాం. నేను ఇటీవలే జిల్లాకు రావడం వలన ప్రక్షాళనకు కొంత సమయం పడుతుంది. అర్హత లేని వైద్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

 డాక్టర్ నరేందర్ రాథోడ్, డీఏంహెచ్‌ఓ, మంచిర్యాల

మరిన్ని వార్తలు