దుర్గమ్మకు పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు

21-10-2026 | 05:56pm

* గ్రామస్థులతో ఆత్మీయ పలకరింపు..

* దేవి యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం..

పాపన్నపేట,అక్టోబర్21: పాపన్నపేట మండలం(Papannapet Mandal) కొడపాక గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల నిమజ్జనం సందర్భంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి(Former MLA Padma Devender Reddy) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి యూత్‌ కమిటీ సభ్యులు(Members of the Devi Youth Committee) ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామస్థులు పద్మాదేవేందర్‌రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపి ఆప్యాయంగా పలకరించారు. వారితో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో కొడపాక గ్రామ సర్పంచి కాశీనాథ్‌రావు, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జగన్‌, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచులు సంగప్ప, సంజీవరెడ్డి, బద్రి మల్లేశం, శ్రీనాథ్‌రావు, నాయకులు బాలరాజు, దత్తు, దుర్గయ్య, శ్రీనివాస్‌గౌడ్‌, వెంకటేశం, మల్లేశం, సాయివర్ధన్‌గౌడ్‌, దేవి యూత్‌ సభ్యులు నాగభూషణం, చారి, చన్‌బసప్ప, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు