బతుకమ్మల పోటీలో విజేతలకు పట్టుచీరల బహుమతులు

21-10-2026 | 06:47pm

తంగళ్లపల్లి, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) తంగళ్ళపల్లి మండలం మండల కేంద్రంలో ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకల్లో భాగంగా ఆకర్షణీయంగా బతుకమ్మలను పేర్చిన మహిళలకు పట్టుచీరలను బహుమతులుగా అందజేశారు. బతుకమ్మల పోటీలో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన ఇద్దరు మహిళలకు డీఎస్పీ నాగేంద్ర చారి చేతుల మీదుగా ద్వారక ఫర్నిచర్స్ యజమాని, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్ పట్టుచీరలను అందజేశారు. సర్పంచ్ మోరల్ లక్ష్మీరాజ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు