ప్రమాదవశాత్తు చెరువులో పడి నీట మునిగి వ్యక్తి మృతి

21-10-2026 | 06:41pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 21 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు చెరువులో పడి నీట మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట గ్రామంలో(Nagireddypeta Village) చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్(SI Bhargav Goud) తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన పోతుల సిద్ధిరాములు(Pothula Siddiramulu) వయసు (35) సంవత్సరాలు.పోతుల సిద్ధిరాములు దసరా పండుగ రోజున గ్రామ శివార్ పరిధిలోని జగ్గన్న చెరువులోకి(Jagganna Cheruvu) స్థానానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళాడు. సుమారు 1:15 గంటలకు అదే గ్రామానికి చెందిన వెంకవ్వ జగ్గన్న చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్ళింది.

వెంకవ్వ బట్టలు ఉతుకుతుండగా సిద్ధి రాములు చెరువులో స్నానానికి వెళ్లి తిరిగి బయటకు రాలేదని కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. సిద్ధ రాములు తల్లి పోతుల లక్ష్మి తన కుటుంబసభ్యులతో కలిసి గ్రామస్తుల సహాయంతో చెరువులో గాలించగా సాయంత్రం వరకు సిద్ధిరాములు మృతదేహం లభించలేదు.

దీనితో నాగిరెడ్డిపేట గ్రామంలో దసరా పండగ వేడుకలు గ్రామస్తులు నిలిపివేశారు.మృతుడు సిద్ధిరాములు ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈత రాక నీటిలో మునిగి మృతి చెందాడు.ఈ ఘటనపై నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ కేసు నమోదు చేసి మృతునికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు