నూతన బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపు ప్రక్రియ పూర్తి

16-10-2026 | 04:49pm

టీ స్టాల్ నిర్వాహకుడికి దక్కిన అదృష్టం 

ములుగు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ములుగు మున్సిపాలిటీ(Mulugu Municipality) పరిధిలో నూతన బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపునకు లక్కీ డ్రా ప్రక్రియ పూర్తయిందని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. శుక్రవారం ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో లక్కీ డ్రా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 41 బార్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఒక బార్‌కు అవకాశం కల్పించారు.

దీనికి సంబంధించి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 376 దరఖాస్తులు అందాయి. వీటికి నిర్వహించిన లక్కీ డ్రాలో 349 టోకెన్ నంబరు గల దరఖాస్తుదారుడు, వెంకటేష్ బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపునకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు